ఇంటర్నెట్ డెస్క్: అడగందే అమ్మయినా అన్నం పెట్టదంటారు. కానీ ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్ సంస్థల అధినేత ఎలాన్ మాస్క్ మాత్రం కొన్ని కంపెనీలకు అడక్కుండానే వరాలు ప్రసాధిస్తున్నాడు. అది కూడా చిన ట్వీట్లతో. ప్రస్తుతం ఎలాన్ మాస్క్ ఒక్క మాట చెబితే చాలు వినడానికి ప్రపంచంలోని అనేకమంది సిద్ధంగా ఉన్నారు. వాట్సాప్ విషయంలో ఇటీవల ఆయన చేసిన ఒక్క ట్వీట్ ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ కు చెమటలు పట్టించింది. అయితే మస్క్ మళ్లీ అలాంటిడే మరో ట్వీట్ చేశాడు.

 అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్ ఎక్స్, విద్యుత్ వాహనాల సంస్థ టెస్లా ద్వారా ఆయన టెక్ రంగంలో ఇతరులెవ్వరికీ సాధ్యం కానీ క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఆయన చెప్పే ప్రతి విషయానికీ ఎంతో పాపులారిటీ ఏర్పడింది. ఈ మధ్య సిగ్నల్ యాప్ వాడాలని ఆయన చేసి ట్వీట్ ఆ యాప్ కు మిలియన్లలో యూజర్లను పెంచింది. ఇక ఇప్పుడు తాజాగా మరో కంపెనీని పొగుడుతూ ఎలాన్ ఓ ట్వీట్ చేశాడు. దీంతో ఆ కంపెనీకి కోట్లకు కోట్లు వచ్చి పడుతున్నాయి. ఎలాన్ ట్వీట్ తర్వాత ఆ కంపెనీ షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగింది.

ఎలాన్ మస్క్ తన పెంపుడు కుక్క కోసమని ఇట్సీ అనే ఈ-కామర్స్ సంస్థ ద్వారా ఉన్నితో తయారు చేసిన ‘మార్షియన్ హెల్మెట్’ను ఆర్డరిచ్చారు. ఆ తరువాత మార్షియన్ హెల్మెట్ ఫొటోలను ట్వీటర్ లో షేర్ చేశాడు. 'ఇట్సీ అంటే నాకు ఒకింత ఇష్టం' అని పేర్కొన్నాడు. అంతే ఇట్సీ షేర్ల ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో రికార్డు స్థాయిలో ఇట్సీ షేర్ ధర 8 శాతానికి ఎగబాకింది.

ఎలాన్ ట్వీట్ తో తమ కంపెనీకి ఊహించని లాభాలు రావడంతో సదరు సంస్థ కూడా ఉబ్బితబ్బిబైపోయింది. 'మీరంటే మాకూ ఎంతో ఇష్టం' అంటూ వెంటనే రిప్లై ఇచ్చింది. అయితే ఇట్సీ సంస్థకు అంతకు అంతకు ముందు నుంచే మార్కెట్‌లో మంచి గుర్తింపు వుంది. ఎందరో చేనేత కళాకారులు తమ వస్తువులను ఇట్సీ ద్వారా అమ్ముతుంటారు. వీరిలో అధికశాతం మహిళలే ఉండడం ఈ సంస్థ ప్రత్యేకత.




మరింత సమాచారం తెలుసుకోండి: