ఇక రోజుకో కొత్త రూపంతో విరుచుకు పడుతున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగిస్తూ.. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ఇక అలాగే మరో వైపు రాష్ట్రంలోకి ఓమిక్రాన్‌ కేసులు కూడా ఎంటరయ్యి ఎక్కువ అవడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటీకీ కరోనా టీకా వేసుకోని మారు మూల ప్రాంతాల్లోని ప్రజలకు వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు ఆరోగ్య సిబ్బంది. ఇక ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. వ్యాక్సిన్‌ వేసేందుకు వెళ్లిన ఆరోగ్య సిబ్బందికి అక్కడ ఓ అనుకోని సంఘటన ఎదురైంది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతు చక్కర్లు కొడుతోంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ అనేది కొనసాగుతోంది. ఈ క్రమంలో వేమనపల్లి మండలం ముల్కలపేటలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ కోసం ఆరోగ్య సిబ్బంది వెళ్లడం అనేది జరిగింది.

ఈ క్రమంలో రాజక్క అనే మహిళకు వ్యాక్సిన్‌ వేయడం జరిగింది. ఇక వెంటనే ఆ మహిళ పూనకం వచ్చినట్టుగా తెగ ఊగిపోయింది. దేవుళ్ల పేర్లను పలుకుతూ చాలా వింతగా ప్రవర్తించడం జరిగింది. ఇక దీంతో అక్కడ ఆశ్చర్యపోయిన ఆరోగ్య సిబ్బంది ఆమెను మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు చాలానే ప్రయత్నించడం జరిగింది. వ్యాక్సిన్‌ గురించి వివరిస్తూ ఆమెకు సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో అయితే నెట్టింట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది.నిజంగా వ్యాక్సిన్ కి భయపడి ఆ మహిళ ఇలా పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించినట్లు అక్కడ అధికారులు ఇంకా సిబ్బంది అనుకున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. వ్యాక్సిన్ వేయించుకుంటే ఇలా కూడా అవుతుందా అని ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: