త్వరలోనే తాజ్ మహాల్ పేరు ను మార్చబోతున్నారట..బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని అనేక ప్రాంతాల పేర్లను మార్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. తాజాగా మరొక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే ఆగ్రా లో పేరొందిన తాజ్ మహాల్ పేరు మార్చే అవకాశం ఉందని, ఉత్తరప్రదేశ్ బీ జే పీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. తాజ్ మహాల్ పేరును రామ్ మహాల్ లేదా కృష్ణ మహాల్ గా మారనుందని యోగి ఆదిత్యనాథ్ రాజ్యంలో ఇది జరుగుతుందని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట్లో వైరల్ అవుతుంది.