ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. డ్రాగన్ అనేది ఒక  శక్తివంతమైన జీవి. దీన్ని చైనా వాళ్ళు శక్తివంతమైన దేవునిగా భావిస్తారు. అంతేగాక.. వారి పురాతన  చరిత్రలో  డ్రాగన్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే చైనా దేశాన్ని డ్రాగన్ దేశం అని అందరూ కొనియాడుతారు. భారీ శరీరం.. నాలుగు కాళ్లు.. రెండు భారీ రెక్కులు.. పొడవైన తోక.. నిప్పులు కక్కే భారీ నోరు.. ఎర్రటి కళ్లు.. భయంకరమైన రూపం డ్రాగన్ సొంతం. దాన్ని  చూస్తేనే గుండె జారిపోతుంది. అయితే, దక్షిణాఫ్రికాలోని సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న కొన్ని చేపలను చూస్తే.. తప్పకుండా డ్రాగన్ గుర్తుకొస్తుంది. ఇవి చూసేందుకు చిన్నగానే ఉన్నా.. చూడటానికి అచ్చం డ్రాగన్ లాగా వింతగా ఉన్నాయి.


కేప్ టౌన్‌ సమీపంలో  ఫిష్ హోక్ సముద్ర తీరంలో కనిపించిన ఈ చేపలు.. నీలం, వంకాయ రంగుల్లో ఉన్నాయి. సుమారు 20 పైగా ఇలాంటి చేప పిల్లలు తీరంలో కదులుతూ కనిపించడంతో పర్యాటకులు భయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పరిశోధకులు వాటిని పరిశీలించగా అసలు విషయం తెలిసింది. ఇవి మామూలు  చేపలు కావని, గ్లాకస్ అట్లాంటికస్ అనే  శాస్త్రీయ నామంతో కలిగిన ఈ చేపలను ‘బ్లూ డ్రాగన్ ఫిష్ ’ అంటారని వెల్లడించారు.




చూడ్డానికి చిన్నగా వున్న కాని చాలా ప్రమాదకరమైన చేపలు అట. వీటి రెక్కలకు విషం ఉంటుందట. ఈ విషం మిగతా జంతువుల నుంచి తమను తాము కాపాడుకోవటానికి ఉపయోగపడుతుందట. అయితే వీటి వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం లేదని పరిశోధకులు వెల్లడించడం జరిగింది....ఇలాంటి మరెన్నో వైరల్ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వైరల్ విషయాలు ఇంకెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: