ఒక సాదాసీదా క్రికెటర్గా ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ తక్కువ సమయంలోనే తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్లో ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నడు. ముంబై ఇండియన్స్ జట్టులో స్థానం దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ తక్కువ సమయంలో ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఓపెనర్ రోహిత్ శర్మ కి తనదైనా సహకారం అందిస్తూ భారీ స్కోర్లు చేయడంలో కీలక పాత్ర వహించాడు. 2020 ఐపీఎల్ సీజన్ లో సూర్యకుమార్ యాదవ్ రాణించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.



 ఒకరకంగా 2020 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ గెలవడానికి సూర్య కుమార్ యాదవ్ కీలకపాత్ర వహించాడు అనే చెప్పాలి. ఐపీఎల్ ఫైనల్ పోరులో కూడా అద్భుతంగా రాణించి ముంబై జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే 2020 ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన సూర్య కుమార్ యాదవ్ ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ క్రమంలోనే మై హోనా అంటూ సైగలు చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్.


 ఇలా ఆ మ్యాచ్ సమయం లో మై హోనా అంటూ సైగలు చేయడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని ఇటీవలే రివీజ్ చేశాడు. సరిగ్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగడానికి ముందు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. అది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ అటు టీమిండియా జట్టులో స్థానం దక్కుతుందని.. ఎంతో ఆశతో ఉన్నాడు. ఇలాంటి సమయంలో అతనికి నిరాశ ఎదురైంది.  కానీ అతని సెలెక్ట్ చేయలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యానని అందుకే ఆ ఎమోషన్ తోనే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: