అవసరమైనప్పుడు కీలకమైన వికెట్లు పడగొట్టడమె కాదు అటు బ్యాటింగ్ లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే నిన్న శ్రీలంకతో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజాకు మొదటి మ్యాచ్లో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. కానీ అటు పోలింగ్ లో మాత్రం తనదైన మార్క్ చూపించాడు ఈ సీనియర్ ఆల్ రౌండర్. నాలుగు ఓవర్లు వేసిన రవీంద్ర జడేజా 28 పరుగులు ఇచ్చాడు. అంతేకాకుండా ఒక కీలకమైన వికెట్ కూడా తీసుకున్నాడు రవీంద్ర జడేజా
10 పరుగులు చేసిన వికెట్ కీపర్ చండీ మాన్ ను ఔట్ చేసి సంబరాలు చేసుకున్నాడూ. అయితే గతంలోనే అల్లు అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని మేనరిజంతో కొన్ని వీడియోలు చేసిన రవీంద్ర జడేజా ఇక ఇప్పుడు మైదానంలో కూడా ఇక ఇలాంటిదే చేసాడు. వికెట్ పడగానే పుష్పా ను అనుకరించాడు. ఇక తన చేతితో గడ్డాన్ని నిమురుతూ తగ్గేదే లే అంటూ యాక్షన్ చేసాడు రవీంద్ర జడేజా. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూశాక అటు అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా తెగ మురిసిపోతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి