ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇకమీదట కరెంటు చార్జీలు పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.. ఇన్నాళ్లు ఒక లెక్క ఉండేది ఇప్పుడు మరొక లెక్క అంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు.. ఇక డెవలప్మెంట్ చార్జీల పేరుతో మరి కొంత భారం ప్రజల మీద వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బాధితుడు వల్ల సామాన్యుడు విలవిలలాడి పోవడం ఖాయం అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు వినియోగదారులు. ప్రస్తుతం వందల్లో వచ్చే బిల్లులు వేలకు చేరితే ఎలా అని బోరు మంటున్నారు ప్రజలు. మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ వంటి ఏరియాలలో సహా ఎక్కడ చూసిన విద్యుత్ బిల్లులు పైన ఎక్కువగా చర్చ నడుస్తున్నది.

ఇంతకుముందు నెలకి రెండు లేదా మూడు వందలు మాత్రమే కరెంటు బిల్లు వస్తూ ఉండగా ఈ సారి ఏకంగా నాలుగు వేల రూపాయలు వచ్చేసరికి వినియోగదారులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. ఎందుకిలా వస్తోంది అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఇది అన్నట్లుగా సమాచారం. ఎంత తగ్గించి వాడినప్పటికీ కూడా వేలల్లో బిల్లులు రావడంతో అధికారులను ప్రశ్నిస్తున్నారు వినియోగదారులు.

ప్రస్తుతం తెలంగాణ లో కొత్తగా డెవలప్మెంట్ బిల్ అనే వాటిని యాడ్ చేసి ఎన్నడూ లేని విధంగా కరెంటు బిల్లులు అధిక భారాన్ని మోపుతున్నారు. ఇక బీదవారు   ఈ కరెంట్ బిల్లులను సామాన్యులు చూసి భయపడుతున్నారు. కనీసం నిరుపేద,మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇలాంటి బిల్లులను తగ్గించాలని ప్రజలు వాపోతున్నారు. మరికొందరు ఈ బిల్లులను కట్టేందుకు అప్పులు చేయవలసి వస్తోంది ఆన్నట్లుగా తెలియజేస్తున్నారు. అధికారులు మాత్రం కాస్త లేట్ అయిన పర్వాలేదు ఖచ్చితంగా కట్టాల్సిందే అని తెలియజేస్తున్నారు. అలా నిజామాబాద్ లో ఒక వ్యక్తి కూలి పని చేసుకునే వారికి నెలకు 400 బిల్లు వచ్చేదట. ప్రస్తుతం తన బిల్లుతో పాటు మరొక బిల్లు డెవలప్మెంట్ చార్జీ కింద 3000 రావడంతో వారు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: