సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం అందరి అరచేతిలోకి వచ్చేసింది అనే విషయం తెలిసిందే. అర చేతిలో స్మార్ట్ఫోన్ ఉందంటే చాలు ప్రపంచం నలుమూలల్లో ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో మారుమూల జరిగిన ఘటనలు కూడా క్షణాల వ్యవధిలో అరచేతిలో వాలి పోతున్నాయి.  ఇలా సోషల్ మీడియా వేదికగా జంతువులు, ప్రకృతికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు ప్రకృతి లో జరిగే అద్భుతమైన ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అని ప్రతి ఒకరు ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సాధారణంగా మేఘాల నుండి వర్షం కురుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక్కో ప్రాంతంలో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. కానీ ఒక గంట సేపట్లో కురవాల్సిన వర్షం కేవలం క్షణ కాల వ్యవధిలో నీళ్లు కుమ్మరించి నట్లుగా కురవడం ఎప్పుడైనా చూశారా.. వర్షం అంటే అలా ఎందుకు కురుస్తుంది అంటారు ఎవరైనా..


 కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది. ఆస్ట్రేలియా లోని మిల్ స్టాట్ సరస్సు రెండు వైపులా పర్వతాలు ఉన్నాయి. అయితే అప్పటి వరకు నిర్మానుష్యంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. సరస్సు చుట్టుపక్కల మొత్తం దట్టమైన మేఘాలు అలముకున్నాయి. ఈ క్రమంలోనే సరస్సు పై నల్లటి మేఘాలు వేగంగా కదులుతూ వచ్చాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుంభవృష్టిగా మేఘాల నుంచి నీరు  కింద పడింది. వర్షం పడుతున్నట్లు గా కాదు ఒక్కసారిగా నీళ్ళు కుమ్మరించినట్టు గా గంట సేపు కురవాల్సిన వర్షం కేవలం క్షణాల వ్యవధిలో కురిసినట్లుగా కనిపించింది. ఎందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: