దసరా పండుగ వచ్చిందంటే చాలు కొన్ని రోజుల ముందు నుంచే నవరాత్రి ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు జరిగిన వినాయక చవితికి సంబంధించిన ఉత్సవాలు ఎలా జరుపుకున్నామొ అనే విషయం నుంచి తేరుకునే లోపే ఇక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి అని చెప్పాలి. ప్రతిరోజు సరికొత్తగా ఇక ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకునేందుకు భక్తులు ఇష్టపడుతూ ఉంటారు. కాగా ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇక దేశంలో ఎక్కడ చూసినా కూడా అంగరంగ వైభవంగా ఈ నవరాత్రులను సెలబ్రేట్ చేసుకుంటూ ఉండటం కనిపిస్తూ ఉంది.


 చిన్నలు పెద్దలు అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో నవరాత్రులను ఆస్వాదిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక తమ సాంప్రదాయాల ప్రకారమే అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే దాండియా గర్భ నృత్యాల లాంటివి చేస్తూ మరోసారి పురాతన సాంప్రదాయాన్ని ఆస్వాదిస్తున్నారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి  ఇక్కడ కొంతమంది దాండియా ఆడిన వీడియో వైరల్ గా మారిపోయింది. దాండియా ఎప్పుడు ఆడుతూనే ఉంటారు ఇందులో కొత్త ఏముంది అని అంటారా..


 అయితే సాధారణంగా నేలపై అటు ఇటు తిరుగుతూ దాండియా ఆడటం లాంటివి చూశాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా స్విమ్మింగ్ పూల్ లో దాండియా ఆడటం కాస్త వైరల్ గా మారిపోయింది. గుజరాత్ లోని సూరత్ లో స్విమ్మింగ్ పూల్ లో కొంతమంది వ్యక్తులు దాండియా ఆడుతున్నట్లు ఈ వీడియోలో చూస్తే కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు సాంప్రదాయం ప్రకారం కేవలం బహిరంగ ప్రదేశాలలో మాత్రమే అందరూ కలిసి దాండియా ఆడటం ఇప్పటివరకు చూసాము.  కానీ ఇక్కడ వీడియో చూసుకుంటే మాత్రం సాంప్రదాయాలకు సరికొత్త విధానాన్ని జోడించినట్లు కనిపిస్తుందని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: