సాధారణంగా సినిమాల్లో దొంగలను పోలీసులు వెంబడించే సన్నివేశాలు ఎన్నో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటూ ఉంటాయని చెప్పాలి. అయితే ఇక ఇలా దొంగలను పోలీసులు వెంబడిస్తున్న సమయంలో ఆ ఘటనతో సంబంధంలేని వారు చివరికి దొంగలను పోలీసులకు పట్టి ఇవ్వడం లాంటిది కూడా జరుగుతూ ఉంటాయి. అయితే సినిమాల్లో ఇలాంటివి చూసి ప్రేక్షకులు వారెవ్వా క్యా సీన్ హై అంటూ తెగ సంబరపడిపోతారు అని చెప్పాలి. అయితే ఇక సినిమాలను తలదన్నే ఘటనలు కూడా కొన్ని కొన్ని సార్లు నిజ జీవితంలో వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇలాంటి ఘటనలు చూసినప్పుడు సినిమాల్లో కూడా ఇలాంటి భారీ చేజింగ్  సీన్లు ఉండవేమో అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో భాగంగా ఓ దొంగను కొంతమంది పోలీసులు వెంబడిస్తూ ఉంటారు. అయితే వారికి దొరక్కుండా ఆ దొంగ చాకచక్యంగా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మధ్యలో ఊహించని అతిధిలా ఎంటర్ అయిన యువతి చివరికి పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతున్న దొంగను పట్టుకుని ధైర్య సాహసాలను ప్రదర్శిస్తుంది అని చెప్పాలి.


 ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే రద్దీ ప్రదేశంలో ఒక దొంగ చోరీ చేసినందుకు ప్రయత్నించాడు. గమనించిన పోలీసులు అతని పట్టుకోవాలని ఇక వెంబడిస్తూ ఉంటారు. అయినప్పటికీ అతను పోలీసులకు దొరక్కుండా పరిగెడుతూ ఉంటాడు. అయితే పోలీసులు ఆ దొంగ వెంట పరిగెత్తడం చూసి స్థానికులు మొదట షూటింగ్ ఏమో అనుకున్నారు. కానీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత స్థానికులకు అసలు విషయం అర్థమైంది. అదే సమయంలో అక్కడ కాలేజీ బ్యాగ్ వేసుకొని ఉన్న యువతి ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించింది. దొంగ దగ్గరికి రాగానే ధైర్యంగా అతని చేయి పట్టుకుని పక్కకు లాగింది. అతను ఆమెను వదిలించుకుని తప్పించుకునే లోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సినిమాలెవెల్ చేజింగ్ సీన్ చూసి అందరూ అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: