కళ్ళ ముందే కడుపున పుట్టిన బిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో వర్ణించడం చాలా కష్టం. అయితే ఇలా బిడ్డల ప్రాణాలు పోతున్న సమయంలో ఇక కన్నతల్లి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతకంటే చావే మేలు అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలాంటి బాధ కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఒకే విధంగా ఉంటుంది. ఎందుకంటే తల్లి ప్రేమ మనుషుల్లో జంతువుల్లో అంతే గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓ తల్లి కుక్కకు ఇలాంటి ఒక బాధే ఎదురయింది అని చెప్పాలి.


 కడుపున పుట్టిన పిల్లలు కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది ఆ కుక్క. ఇక నా పిల్లలను కాపాడు దేవుడా అంటూ ఎంతగానో తల్లడిల్లిపోయింది అని చెప్పాలి. ఇటీవల ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఎంతోమందిని మనసును కదిలిస్తుంది ఈ వీడియో. బషీరాబాద్ మండలం మంతటి గ్రామంలో ఒక కుక్క ఇటీవలే మూడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది.


 అక్కడే ఉన్న ఒక కుటీరంలో ఆవాసాన్ని ఏర్పరచుకున్న కుక్క ఇక పిల్లలతో కలిసి ఉంటుంది. కానీ ఇక ఆ కుక్క మీద విధి పగబట్టినట్లుగానే వ్యవహరించింది. తల్లి కుక్క ఆహారం కోసం బయటికి వెళ్ళిన సమయంలో ఒక భారీ నాగుపాము అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ చిన్నారి కుక్కపిల్లలపై విరుచుకుపడింది. ఒకదాని తర్వాత మరొక దానిపై విషపు కోరలను విసురుతూ వచ్చింది. దీంతో ఆ మూడు కుక్క పిల్లలు కూడా చివరికి ప్రాణాలు కోల్పోయాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన తల్లికుక్క ఇక నాకు పామును ఎదిరించలేకపోయింది నిస్సహాయ స్థితిలో అరుస్తూ ఉండిపోయింది. అయితే ఇక ఇదంతా అక్కడ ఉన్నవారు వీడియో తీశారు తప్ప పామును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.దీంతో ఇక వీడియోతీసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేటిజన్స్. కనీస మానవత్వం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: