
దీంతో పరిస్థితి మరింత విషాదకరంగా మారిపోయింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగానే టేక్ ఆఫ్ పైన 32 సెకండ్లలోనే కూలిపోయింది అంటూ అధికారులు ధృవీకరించారు . కాగా ఇందులో 229 మంది ప్రయాణికులు .. ఇద్దరు పైలెట్లుపదిమంది ..10 మంది విమాన సిబ్బంది మరణించారు . విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా మరణించారు. అంతేకాదు కొంతమంది స్టార్స్ కి సంబంధించిన బంధువులు కూడా ఈ విమానంలో ప్రయాణించి మరణించినట్లు తెలుస్తుంది .
ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో బంధువు కూడా ఈ విమాన ప్రమాదంలో మరణించాడు . ఆ విషయాన్ని ఆ నటుడు సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు . ఆయన మరెవరో కాదు కో పైలట్ క్లైవ్ కుందన్. క్లైవ్ కుందన్ బాలీవుడ్ నటుడు విక్రాంత మాసేకి బంధువు . దీనిని విక్రాంతమాసే స్వయంగా ధ్రువీకరించారు. 12 ఫెయిల్ సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న విక్రాంత్ సోషల్ మీడియా వేదికగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి తన సంతాపం వ్యక్తం చేశారు .
అంతేకాదు ఆయన ఈ విమాన ప్రమాదంలో తన బంధువు కూడా మరణించాడు అన్న విషయాన్ని తెలియజేశారు. "అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు ప్రియమైన వారి గురించి ఆలోచిస్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉంది . ఈ విమాన ప్రమాదంలోనే నా మామ క్లింఫర్ట్ కుమారుడు కూడా చనిపోయాడు. అది తెలిసి మరింత బాధగా ఉంది . ఆ విమానంలో ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందన్ నే అంటూ ఇంస్టాగ్రామ్ లో స్టోరీ లో రాసుకోచ్చారు . అయితే క్లైవ్ కుందన్ పేరుకి మామ కొడుకే అని కానీ ఆయన సొంత బ్రదర్ కన్నా ఎక్కువగా వీళ్ళ బాండింగ్ ఉంటుంది అని వీళ్ళ బంధువులు కూడా మాట్లాడుకుంటున్నారు . విమాన ప్రమాదం గురించి చాలామంది ప్రముఖులు స్పందించారు . రష్మిక మందన్నా..అక్షయ్ కుమార్ ..అలియా భట్ ..కంగనా.. అల్లు అర్జున్ .. సోనోసూద్ ..రన్వీర్ సింగ్ .. షారుక్ ఖాన్ .. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు..!
