దేశంలో వివిధ నగరాలలో లక్షలాదిమంది ప్రజలు మెట్రో రైలు ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువగా ఈ ప్రయాణం తమ ప్రయాణాలకు మెట్రోని చూస్ చేసుకుంటూ ఉంటారు . మెట్రోలో అయితే చాలా సునాయాసంగా తమ ప్రయాణం ముగుస్తుంది అని భావిస్తూ ఉంటారు . అయితే మీరు గమనించినట్లయితే మెట్రో రైలు రాత్రివేళ నడపరు . ఎందుకని రాత్రి వేళల్లో మెట్రో రైలు నడపరు..? అనే సందేహం చాలా మందికి ఉంటది. మామూలు ట్రైన్స్ రాత్రివేళ నడుపుతారు కదా..? మరి మెట్రో ట్రైన్ విషయంలో ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేదు..? దీని వెనుకున్న కారణం తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది..!!


మెట్రో ట్రైన్ ని రాత్రి వేళ్లల్లో నడపకపోవడానికి ప్రధాన కారణ, నిర్వహణ పనులు.  రాత్రి సమయంలో మెట్రో రైళ్లను నిలిపివేసి, ట్రాక్‌లు, విద్యుత్ వ్యవస్థ, సిగ్నలింగ్ సిస్టమ్, స్టేషన్లను పరిశీలించేందుకు, మరమ్మతులకు సమయం గా ఉపయోగిస్తారు. ఆ కారణం చేతనే రాత్రి వేళ్లల్లో ఈ ట్రైన్ నడపరు.  ఇది ప్రయాణికుల భద్రత కోసం చాలా చాలా అత్యవసరం. అంతేకాదు ప్రయాణికులు ఆ సమయంలో తక్కువగా ఉండటం మరోక కారణంగా చెప్పవచ్చు. రాత్రివేళలో మెట్రోలో ప్రయాణించే వారు చాలా తక్కువగా ఉంటారు. ఇది ఆర్ధికంగా కూడా అంత లాభదాయకం కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ.



అంతేకాదు సిబ్బంది అవసరం తగ్గుతుంది. రాత్రి సమయాల్లో సిబ్బందిని కల్పించడం అనగా లొకోపైలట్, గార్డ్స్, స్టేషన్ సిబ్బంది కష్టం మరియు ఖర్చుతో కూడినది. ఇది వరై షిఫ్టులపై ప్రభావం ఉంటుంది. అలాగే కొత్త ట్రయల్ రన్లు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కొత్త టెక్నాలజీ లను పరీక్షించడం లాంటివి రాత్రి వేళలోనే నిర్వహిస్తూ ఉంటారు మెట్రో అధికారులు . పక్క రోజు మెట్రో ప్రయాణం సజావుగా నడిపేందుకు ఇది ప్రయాణికులకు చాలా చాలా సులభంగా ఉంటుంది అన్న కారణం చేతనే రాత్రివేళ మెయిన్స్ పనులు చేస్తూ మెట్రో రైలు రాత్రి వేళల్లో నడపరు. భద్రతా పరంగా రాత్రి మెట్రో నడిపే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు మెట్రో ప్రధానంగా ఆఫీస్ అవర్స్, పీక్ టైమ్ ప్రయాణాల కోసం ఉంటుంది. రాత్రి సమయంలో ట్రాఫిక్ అవసరం ఉండదు..అప్పూదు మెట్రో వాడే వారి సంఖ్య కూడా తగ్గుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: