
మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది దిగ్గజాలు సైతం సాధారణ సీదా జీవితం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో సరిపల్లి కోటిరెడ్డి కూడా ఒకరు.. పొలం పనులు తప్ప ఇంకేం పనులు చేస్తామనుకునే కుటుంబం నుంచి.. సర్వ ప్రపంచాన్ని అవలీలలుగా ఏలగలిగిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మరి తన సత్తా చాటారు సరిపల్లి కోటిరెడ్డి.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాలో పుట్టి ఢిల్లీ రాజధాని వరకు తన పేరును వినిపించ గలిగేలా ఎదిగారు. టెక్ దిగ్గజంతో ఎంతోమంది కుటుంబాలకు ఉపాధి కలిగించిన కోటి గ్రూప్ ఆఫ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
నిరంతరం తన సాధనతో ముందుకు వెళుతూ.. తన జీవితంలో తాను అనుకున్న మైలురాళ్లను లక్ష్యంగా పెట్టుకొని మరి ముందుకు సాగారు. ఆ లక్ష సాధనలో ఆయన ఎప్పుడూ కూడా వేను తిరిగి చూడలేదు. నిరంతరం ఒక శ్రామికుడిగా కష్టపడుతూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ తన విజయాన్ని చూపించారు. కేవలం తన ప్రాతమే కాకుండా దేశం , ప్రపంచం మొత్తం తన వైపు తిరిగేలా అడుగులు వేశారు సరిపల్లి కోటిరెడ్డి. ప్రపంచ టెక్ దిగ్గజాలలో ఒకరిగా పేరు సంపాదించారు.
సరిపల్లి కోటిరెడ్డి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. ఈయనను ప్రశంసించని ప్రఖ్యాతలు లేరు. ఈయన గురించి చెప్పని మీడియా లేదు. ఈయనను భారత్ వర్చువల్ పీస్ అండ్ ఆర్గనైజేషన్ సంస్థగా డాక్టర్ రేటు కూడా అందించింది సరిపల్లి కోటిరెడ్డికి. తమ సంస్థలో పని చేసే వారందరినీ కూడా ప్రోత్సహించడంలో ముందు ఉంటారు.
తల్లి ఇచ్చిన రూ .1000 రూపాయల పెట్టుబడితో PGDCA నేర్చుకొని మరి కంప్యూటర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తాను కన్న కలల కోసం కొన్నేళ్లపాటు కష్టపడి సాధించారు.. ఈరోజు 14 కంపెనీలకు బాసుగా ఉండడమే కాకుండా ఎంతోమంది ఉపాధి కల్పించేందుకు కారణమయ్యారు సరిపల్లి కోటిరెడ్డి
కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ద్వారా.. ఇండియా హెరాల్డ్, భారత్ హెల్త్ కేర్ లేబరోటిస్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఈ గుడి, కోటి ఫౌండేషన్, సేవా ఫౌండేషన్, క్లౌడ్ బ్లడ్, భారత్ ఇన్ఫోవేషన్ ల్యాబ్ ఇతరత్రా వాటిని స్థాపించి ప్రజలకు అవసరమైన వాటిని తీర్చడంలో ముందు వరుసలో ఉన్నారు. ఈరోజు సరిపల్లి కోటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని ఇండియా హెరాల్డ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.