గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గర్భిణులు అండర్ వైర్ బ్రాలను ధరించడం మంచిదేనా. వాటిని ధరించడం వలన ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దామా. అయితే ప్రసవానికి కొంతకాలం ముందే వక్షోజాల్లో హార్మోనల్ మార్పుల కారణంగా పాలు తయారవుతాయి, అండర్ వైర్ బ్రాలతో రక్తప్రసరణ దెబ్బతిని, పాల తయారీపై ప్రభావం పడుతుందనే అపోహ ఎప్పటినుంచో ఉంది.