సాధారణంగా గర్భధారణ సమయంలో గర్భిణులు బరువు పెరుగుతుంటారు. అయితే ఎక్కువ బరువు ఉంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారనే లెక్కలు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా గర్భిణీ స్త్రీలు అతిగా తినటం, విపరీతమైన బరువెక్కడం మాత్రం అస్సలు మంచిది కాదు. గర్భిణీల కోసం న్యూట్రిషనిస్టులు మంచి ఫార్ములాను తయారు చేశారు. సుమారుగా చెప్పాలంటే సాధారణ బరువుకంటే 12 కేజీల బరువు పెరగటం వరకూ పర్వాలేదు అని వీరు సలహా ఇస్తున్నారు.