సాధారణంగా మనకు తెలిసినంత వరకు మహిళలు గర్భధారణ సమయంలో మాత్రమే కుంకుమ పువ్వు తీసుకుంటారు. దీనిని తీసుకోవడం వలన పిల్లలు మంచిగా పుడతారని వాళ్ళ నమ్మకం. అయితే ప్రసవం తర్వాత చాలా మంది తల్లుల్లో ఒత్తిడి, చిరాకు, ఆందోళన, ఏడుపు లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది సుమారు 15% మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.