గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకుకోవాలి. లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆహారం విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలు మీకు, మీ కడుపులోని పిండానికి మంచి చేస్తే.. మరికొన్ని ఆహార పదార్థాలు మొత్తానికే సమస్యని తీసుకొస్తాయి. అదే విధంగా.. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది.