గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక సమస్యలకు గురవుతుంటారు. ఇక గర్భిణీగా ఉన్నప్పుడు మహిళ శరీరంలో హార్మోన్లలో కలిగే మార్పుల వల్లనే అజీర్తి సమస్యలు వస్తుంటాయి. గర్భిణీ కడుపులో బేబీ పెరుగుతున్నా కొద్దీ మహిళ కడుపు భాగంలో ఒత్తిడి పెరుగుతుంటుంది.