ప్రతి మహిళ బిడ్డకు జన్మనివ్వాలని చాలా కలలు కంటుంటారు. పుట్టే బిడ్డలతో అమ్మ అని పిలుపించుకోవాలని చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే చాలా మంది దంపతులు , తమకు కవలలు పుట్టాలనుకుంటారు. ఇద్దరు పిల్లలకు ఒకే డ్రెస్ వేసి, ఆ దృశ్యాన్ని కళ్ళ నిండా నింపుకోవాలనే ముచ్చట ఎవరికుండదు.