మహిళలకు  చిరాకు పెట్టె సమస్యలలో అవాంఛిత రోమాలు ఒక్కటి.ఇవి ఎక్కువశాతం అబ్బాయిల్లో పెరుగుతాయి. కానీ కొంతమంది మహిళలు కూడా ఇలాంటి సమస్యని ఎదుర్కుంటున్నారు.అసలు అవాంఛిత రోమాలు ఆండ్రోజెన్స్ అనే హార్మోన్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ముఖంలో లైట్ గా హెయిర్ వస్తుంది. ఇంకా మెడిసిన్స్, ఓబేసిటి, మరియు హార్మోనుల లోపం ఇవన్నీ ఫేషియల్ హెయిర్ గ్రోత్ కు కారణమవుతాయి. ఇటువంటి హెయిర్ ను తొలగించుకోవడానికి కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం కన్నా ఇంట్లో కొన్ని పద్ధతుల ద్వారా వాటిని తొలగించుకోవచ్చు.

 

అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు రెండు కప్పుల పుదీనా రసం తీసుకోవడం  వల్ల అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ వల్ల మహిళల ముఖంపై పెరిగే అనవసర వెంట్రుకలను నివారించవచ్చని పరిశోధనలో వెల్లడైంది. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి వల్ల ఆడవారిలో అవాంఛిత రోమాలు కనబడుతాయి. దీని నుండి బయటపడాలంటే పుదీనా టీ తాగడం వల్ల హార్మోన్ బాలన్స్ లో ఉంటాయి.

 

పసుపులో యాంటీబ్యాక్టిరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది ఫేషియల్ హెయిర్ ను తొలగిస్తుంది. చర్మ రంద్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. ఒక గిన్నెలో పసుపు, రోజ్ వాటర్, పాలు తీసుకుని పేస్ట్ లాగా చేసి అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయాలి. ఈ ప్యాక్ పూర్తిగా డ్రైగా మారిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

 

ఆరెంజ్ తొక్కలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫేషియల్ హెయిర్ ను లైట్ గా మార్చుతుంది. తిరిగి పెరగకుండా నివారిస్తుంది. ఆరెంజ్ పీల్ పౌడర్, లెమన్ పీల్ పౌడర్, ఓల్ మీల్ పౌడర్, రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి ఈ పేస్ట్ ను అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి.

 

పంచదార రఫ్ గా ఉండటం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మరంద్రాలు తెరచుకునేలా చేసి హెయిర్ సెల్స్ ను వదులు చేస్తాయి. నిమ్మరసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఒక బౌల్లో షుగర్, లెమన్ జ్యూస్, ఆలివ్ ఆయిల్ కొద్దిగా వేసి మిక్స్ చేసి ముఖంలో హెయిర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 5 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: