తన భర్త రాజీవ్ గాంధీ మరణానంతరం ఆమె మానసికంగా ఎంతో కుంగిపోయారు. అయినా తన బిడ్డల విషయంలో మాత్రం ఎక్కడా తన కుంగుబాటు కనబడనీయకుండా వారి భవిష్యత్తు కోసం ఎంతో తపనపడ్డారు. రాజీవ్ మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీ పెద్దలు కోరినప్పటికీ తన బిడ్డల భవిష్యత్తే తనకు ముఖ్యమని రాజకీయాలకు దూరం పాటించారు. అయితే తన కుమార్తె ప్రియాంకా గాంధీ వివాహానంతరం కాంగ్రెస్ పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు 1997లో సోనియా గాంధీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాతి ఏడాది పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు.
అయితే 2004లో రాహుల్ గాంధీ విజయవంతమైన రాజకీయ అరంగేట్రం చేశారు. విధ్యాధికుడైన రాహుల్ గాంధీకి రాజకీయ అవగాహన అంతగా లేకపోవడమే అతడిని కాస్త తక్కువ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే తన కుమారుడిని పరిపూర్ణమైన రాజకీయవేత్తగా తీర్చిదిద్దేందుకు సోనియా గాంధి ఎంతో కృషి చేశారు. రాజకీయ చదరంగంలో ప్రతిపక్ష పార్టీలను ఎలా ఎదుర్కొవాలన్న విషయాల దగ్గర నుంచి దేశాన్ని ఏవిధంగా ముందుకు నడింపించాలన్న విషయాల వరకు రాహుల్‌కు నేర్పించారు. రాహుల్ గాంధీ అభ్యున్నతికి సోనియా గాంధీ చేసిన కృషి భావితరాల తల్లులకు ఆదర్శంగా నిలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి