భారతదేశం కలలుగన్న విషయాలలో ఒకటి మహిళల కు స్వతంత్రం రావాలి. మహాత్మా గాంధీ కన్న ఒక కల అర్ధరాత్రి ఓ మహిళ ఒంటరిగా నడిచి ఇంటికి క్షేమంగా వెళ్లడమే. కానీ ఇప్పటికీ అది జరగలేదు. అర్ధరాత్రి సంగతి పక్కన పెడితే మిట్టమధ్యాహ్నం కూడా ఆడవారు ఒంటరిగా ఇంటికి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. దేశం 75 వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా చేసుకుంటుంది. కానీ మనకు జన్మనిచ్చి పెంచి పోషించే మహిళల భద్రత గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంతోమంది పోరాటాలు త్యాగాల గురించి ఈ నేల పై దేశం సాధించిన అభివృద్ధి వరకు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.

కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ అభివృద్ధి లో ఎంత మంది మహిళలు తమ ప్రాణాలను కోల్పోయారు. అ కారణంగా ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయి. అనేది ఎవరు పట్టించుకోవడం లేదు. భారతదేశం ఇప్పటి వరకు చేసిన పోరాటంలో సాధించిన ప్రగతి లో పాలుపంచుకుంటున్న మహిళలకు  సరైన ప్రాధాన్యం దక్కుతుందా అంటే లేదని చెప్పాలి. మగవారితో కలిసి పోటీపడుతూ అందరికీ ఆదర్శం గా నిలుస్తున్న మహిళకు నిజంగా స్వేచ్ఛ, ప్రముఖ స్థానం దక్కుతుందా అంటే లేదు అనే చెప్పాలి.

అలాంటి మహిళ ఎందుకు అన్యాయానికి గురి అవుతుంది. అభివృద్ధిలో ప్రముఖ స్థానం దక్కించుకోలేక పోతుంది. అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా.. ఈ అఖండ భారతావనిలో మగువకు స్థానం అసలు లేదు అనేది అక్షర సత్యం. అవమానాలు ఛీత్కారాలు ఇవి కాదా ఆమెకు చిరకాలం తోడుగా వచ్చినవి. ఎన్నో అత్యాచార ఘటనలు భారత దేశాన్ని కుదిపేసిన కూడా అలాంటి ఘటనలు ఇంకా ఆగడంలేదు. ఎంతో మంది చిన్నారులు సైతం ఈ కామ పిశాచాల కు బలి అవుతున్నారు. దీనికి ముగింపు లేదా.. తరతరాలుగా ఆడవారిపై జరుగుతున్న ఈ అఘాయిత్యాలకు అంతం చేసే దేవుడు ఇంకా రాడా..

మరింత సమాచారం తెలుసుకోండి: