పురుషులతో సమానంగా మహిళలు కూడా ప్రతి రంగంలోనూ తమ ఉనికిని చాటుతున్నారు. అంతే కాదు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఆడవారు వంటింటి కుందేళ్ళు అనే మాటను అణగదొక్కి సంచలన విజయాలను అందుకుంటున్నారు. ఇప్పుడు దాదాపుగా అందరూ మహిళలు స్వయం శక్తిని నమ్ముకుని తమ ప్రతిభను కనబరచడమే కాకుండా ఆర్థికంగా కుటుంబానికి సహాయంగా నిలుస్తున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలు ఉరుకులు పరుగులు తీస్తూ కాలంతో పోటీ పడుతున్నారు. అయితే ఉద్యోగం చేసే మహిళలు ఇటు కుటుంబ బాధ్యతను అటు వృత్తి రీత్యా రెండు భాద్యతలను నెరవేర్చాల్సి ఉండగా, ఈ క్రమంలో చాలా మంది మహిళలు తమ గురించి తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.

తద్వారా భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకనే భాధ్యతల్ని పూర్తిచేసే తరుణంలో తమ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వారి డైట్ లో ఈ ఆహార పదార్థాలను చేర్చడం వలన తగినన్ని న్యూట్రీషియన్స్ శరీరానికి అందుతాయని తద్వారా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

* మహిళలకు నెలసరి సమస్య  కారణంగా ఐరన్ అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వారి రోజువారీ ఆహరంలో రాగులు, ఖర్జూరం, బీన్స్, బెల్లం, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి.

* ఉద్యోగం చేసే మహిళలకు ఎముకలు దృఢంగా ఉండడం కూడా ఎంతో ముఖ్యం. వీరి శరీరానికి వెయ్యి గ్రాముల క్యాల్షియం వరకు అవసరమవుతుంది. కాబట్టి తక్కువ ఫ్యాట్ ఉండే పాల ఉత్పత్తులను తరచూ తీసుకుంటూ ఉండాలి. అలాగే కనీసం రెండు బాదం పప్పు లను అయినా రోజు తినాలి.

* రోజు ఎనిమిదిగంటలకు పైగా పనిచేసే మహిళలు ఏదైనా ఒక పండును తినటం మంచిది.

* ఆకుకూరలను మరియు కూరగాయలను వారంలో నాలుగు రోజులు ఉదనేలా ప్లాన్ చేసుకోవాలి. ఒత్తిడిలో ఉండకూడదు, రాత్రిళ్ళు నిద్ర సరిగా ఉండాలి.

ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘ కాలం ఉద్యోగాలు చేసే మహిళల ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: