రష్యా ప్రభుత్వం ఓ బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ ఆ దేశ మహిళలకు బంపర్ ఆఫర్‌ ఇచ్చారు. పది మంది అంత కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు భారీ బహుమానం ప్రకటించారు. మదర్‌ హీరోయిన్‌ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును 1944లో అప్పటి సోవియట్‌ ప్రీమియర్‌ జోసెఫ్‌ స్టాలిన్ మొదట ప్రవేశపెట్టారు.


దీని ప్రకారం 10మంది అంత కంటే ఎక్కువ పిల్లలను కనే మహిళలకు భారీ బహుమతి ఇస్తారు. ఆ డబ్బు మన భారత కరెన్సీలో 13లక్షలకు పైనే ఉంటుంది. ఈ డబ్బు 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజున చెల్లిస్తారు. ఓ కండీషన్ ఏంటంటే.. అప్పటికి మిగతా 9మంది పిల్లలు కూడా జీవించి ఉండాలి. పాత అవార్డును మళ్లీ ఇప్పుడు బయటకు తీయడం ఆ దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: