మోకాళ్లు మో చేతుల పై నలుపు తగ్గాలంటే కరివేపాకు ఆకులు ఎనిమిది నుంచి తొమ్మిది ఆకులు తీసుకొని , ఒక బాణలిలో వేసి ,చిన్న మంట పైన బాగా వేయించాలి. తర్వాత ఈ ఆకులను మెత్తటి పొడి లాగా తయారు చేసి, ఈ పొడికి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం , అవసరమైతే రెండు నుండి మూడు చుక్కల రోజ్ వాటర్ ను కలపవచ్చు. ఇక ఇలా కలిపిన మిశ్రమాన్ని మెత్తటి పేస్టులాగా తయారుచేసి మోకాళ్ళు, మోచేతుల పై ఎక్కడైతే నల్లగా ఉంటుందో, ఆ ప్రదేశాలలో అప్లై చేసి, పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మీ చర్మం పొడిగా అనిపిస్తే , అందుకు మాయిశ్చరైజర్ కూడా రాసుకోవచ్చు. ఇలా తరచూ చేయడం వల్ల అతి తక్కువ కాలంలో ని నలుపుదనం తగ్గడాన్ని గమనించవచ్చు..