థ్రెడ్ లిఫ్ట్ లో సాగిపోయిన చర్మాన్ని  లిఫ్ట్ చేయడం కోసం టెంపరరీగా కుట్లు వేస్తారు. అందుకే దీనిని  థ్రెడ్ లిప్ట్  అని అంటారు. సాధారణంగా స్కిన్ లూజ్  అయ్యి, సాగిపోయి, ముడతలు వచ్చిన వారికి ఈ థ్రెడ్ లిఫ్ట్ ను చేసి,చర్మాన్ని టైట్ చేయడం వల్ల చూడ్డానికి అందంగా కనిపిస్తారు . వయసు పెరుగుతున్న కొద్దీ,ముఖంమీద ముడతలు రావడం,మచ్చలు ఏర్పడటం లాంటివి  మొదలవుతాయి. దాంతో  ముఖం మీద గీతలు రావడం, బుగ్గలు  సాగిపోవడం లాంటిది జరుగుతుంది.అందుకే వీటన్నింటిని ముఖం మీద కనపడకుండా థ్రెడ్  లిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ థ్రెడ్ లిప్ట్ ఎలా చేయించుకోవాలో? ఇప్పుడు చూద్దాం

అయితే మనలో చాలామంది థ్రెడ్ లిఫ్ట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అని అనుకుంటుంటారు.  కానీ ఈ థ్రెడ్ లిప్ట్  కేవలం 60 నిమిషాల లోపు ప్రాసెస్ మాత్రమే. ఈ ప్రాసెస్ లో తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారు. ఈ ప్రక్రియలో సాగిన చర్మాన్ని కరెక్ట్ చేసి కంటూర్స్ ని వెనక్కి తెస్తారు. ఈ ప్రాసెస్ లో యూస్ చేసిన థ్రెడ్స్  ఆరు నెలల తర్వాత శరీరంలో కలిసిపోతాయి.అయితే థ్రెడ్ లిప్ట్  చేయించుకోవాలి అనుకునే వారు మాత్రం ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి.

థ్రెడ్ లిఫ్ట్ ప్రాసెస్ లో ఉపయోగించే  థ్రెడ్స్ చాలా రకాలు. కామన్ గా యూస్ చేసే థ్రెడ్స్  మాత్రం పాలీ డైఆక్సనోన్ థ్రెడ్స్. ఒకసారి ఈ థ్రెడ్స్ వాడితే రెండు సంవత్సరాల వరకు ఫలితం ఉంటుంది.

దీనికి రికవరీ టైం కూడా చాలా తక్కువ. ఇది కేవలం ఫేస్ లిప్ట్ మాత్రమే సర్జరీ కాదు.  ఈ ప్రాసెస్ మొత్తం ఒక గంటలో కంప్లీట్ అయిపోతుంది వెంటనే మీరు మీ నార్మల్ ఆక్టివిటీస్ చేసుకోవచ్చు.

అయితే మీ డెర్మటాలజిస్ట్ తో అన్ని వివరంగా చర్చించండి. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో?మీకు ఉన్న సందేహాలు ఏమిటో? అన్ని మాట్లాడండి. అయితే మీ ఎక్స్పెక్టేషన్స్ వాస్తవానికి దగ్గరగా ఉండడం ముఖ్యము. అయితే ఇంకొకరి ముఖంలా కనిపించడం కోసం ఫేస్ లిఫ్ట్ చేయించుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం మీరు అందంగా కనిపించడం కోసం మాత్రమేనని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: