ఇక అందుతున్న టాక్ మేరకు, మరింత ఆలస్యం లేకుండా వచ్చే వారానికే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఫైనల్ నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యంగా డిసెంబర్ 12నే విడుదల తేదీగా లాక్ చేసిన అవకాశాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక అప్డేట్ ఈ రోజువచ్చేయొచ్చని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.ఇంకా మరో ఆసక్తికర అంశం ఏమంటే, థియేటర్లలో గ్రాండ్ ప్రీమియర్స్ ఈ నెల 11 నుంచే ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అంటే అభిమానులకు టపాసుల్లాంటి ఎంటర్టైన్మెంట్ మొదలవుతుందన్నమాట. కానీ ఇవన్నీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.
సంగీతం విషయానికొస్తే థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రీ విజువల్ టీజర్ మరియు పోస్టర్లు ప్రేక్షకుల్లో అసాధారణమైన హైప్ క్రియేట్ చేశాయి. అంతేకాక 14 రీల్స్ ప్లస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి భారీ బడ్జెట్ కేటాయించినట్టు తెలిసింది.ఇక మొత్తంగా చూస్తే—ఒకసారి అధికారిక రిలీజ్ డేట్ వచ్చింది అంటే, బాలయ్య మాస్ ఫీస్ట్‌కి కౌంట్‌డౌన్ మొదలయ్యే అవకాశం ఖాయం. అందువల్ల అఖండ 2 పై ఉన్న ఆసక్తి, అంచనాలు రోజురోజుకూ మరింత పెరుగుతూనే ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి