ఇక ఒక ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి.మన జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఉల్లిపాయ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన జుట్టు ఎదుగుదలకు కెరోటిన్ అనే పదార్థం చాలా అవసరం. ఈ కెరోటిన్ ఉత్పత్తిని ప్రేరేపించే గుణాలు ఉల్లిపాయలో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో చాలా ఎక్కువగా ఉండే సల్ఫర్ జుట్టుకు రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేస్తుంది. జుట్టు చిట్లడం, జుట్టు రాలడం ఇంకా అలాగే జుట్టు తెల్లబడడం వంటి సమస్యలకు ఉల్లిపాయ మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.ఇక ఈ ఉల్లిపాయలను ముక్కలుగా చేసిన తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక 4 లేదా 5 జామ ఆకులను తీసుకుని వాటిని కూడా ముక్కలుగా చేసుకోవాలి. ఈ జామ ఆకుల్లో విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇక ఇవి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. అలాగే జుట్టును ఆరోగ్యంగా చేయడంలో జుట్టు కుదుళ్లను ధృడంగా చేయడంలో  కొబ్బరి నూనె కూడా చాలా బాగా సహాయపడుతుంది.


ఈ మూడు పదార్థాలను వాడి నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నూనెను పోసుకొని దానిని వేడి చేయాలి. నూనె గోరు వెచ్చగా అయిన తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఇంకా అలాగే జామ ఆకులను వేసి బాగా కలపాలి. ఈ రెండింటిని చిన్న మంటపై ఒక 20 నిమిషాల పాటు ఉంచి వేడి చేయాలి. ఇలా వేడి చేయడం వల్ల ఉల్లిపాయల్లో ఇంకా జామ ఆకుల్లో ఉండే పోషకాలు నూనెలోకి వస్తాయి.తరువాత వీటిని పూర్తిగా చల్లారే దాకా ఉంచి వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్లకు ఇంకా అలాగే జుట్టుకు బాగా పట్టించి మర్దనా చేసుకోవాలి.ఉదయాన్నే కెమికల్స్ తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు ఈ టిప్ ని పాటించడం వల్ల జుట్టు పెరుగుదలలో వచ్చిన మార్పును మనం గమనించవచ్చు. ఈ టిప్ ని పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: