మన పూర్వకాలంలో తలస్నానం చేయడానికి కుంకుడు కాయలను మాత్రమే ఉపయోగించే వారు. కుంకుడుకాయలను దంచి ఇంకా నానబెట్టి వాటి నుండి రసాన్ని తీసి తలస్నానం చేసే వారు. కంకుడుకాయలను ఉపయోగించడం వల్ల జుట్టు మురికి చాలా ఈజీగా పోయేది. అలాగే దీనిని వాడటం వల్ల జుట్టుకు ఎటువంటి హాని కలగదు. కానీ నేటి కాలంలో మార్కెట్ లో చాలా రకాల షాంపులు ఉన్నాయి.వీటిని వాడడం వల్ల జుట్టు ఒత్తుగా ఇంకా బలంగా తయారవుతుందని ప్రకటనలు ఇవ్వడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. వీటిని వాడడం వల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు కానీ దుష్ప్రభావాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. షాంపులల్లో నురుగు రావడానికి ఎక్కువగా రసాయనాలను వాడతారు. షాంపుతో తలస్నానం చేయడం వల్ల కొద్దిగా రుద్దగానే నురుగు వస్తుంది కానీ జుట్టు మురికి మాత్రం అస్సలు పోదు. ఇంకా అలాగే దీనిలో వాడే రసాయనాల కారణంగా జుట్టు విరిగిపోవడం, జుట్టు తెగిపోవడం ఇంకా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి షాంపులకు బదులుగా కంకుడుకాయలను వాడడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మనలో చాలా మంది కూడా కుంకుడుకాయలను వాడడం ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు.


కుంకుడుకాయలను వాడడం వల్ల ఖచ్చితంగా జుట్టు చిక్కులు పడుతుంది. అలాగే కళ్లు మండుతాయి అని భావిస్తూ ఉంటారు. కానీ కుంకుడుకాయలను వాడడం వల్ల చుండ్రు సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే తలలో చేరిన బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి నశిస్తాయి. పేల సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు చాలా బలంగా తయారవుతాయి.ఈ కుంకుడుకాయలను ఉపయోగించడం ఇబ్బందిగా భావించే వారు వాటిని పొడిగా చేసుకుని వాడడం మంచిది. ముందుగా కుంకుడుకాయలను తీసుకొని వాటిని దంచాలి.ఇంకా అలాగే వాటి లోపల ఉండే గింజలను కూడా దంచాలి.ఈ గింజలపై ఉండే నల్లటి పెంకును తీసేసి లోపల ఉండే పప్పుతో పాటు కుంకుడుకాయలను కూడా ఎండబెట్టాలి. ఆ తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా మిక్సీ పట్టుకోవాలి.ఆ తరువాత ఈ పొడిని జల్లించి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని నేరుగా జుట్టుపై వేసి మీరు వాడుకోవచ్చు లేదా వేడి నీటిలో కలిపి వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కుంకుడుకాయలతో ఈజీగా జుట్టును శుభ్రం చేసుకోవచ్చు. ఇలా షాంపులకు బదులుగా కుంకుడుకాయలను వాడడం వల్ల మన జుట్టు రాలడం ఈజీగా తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: