సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఇప్పుడు తెలుగుదేశం నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మాకు ఒక న్యాయం మీకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పోలీసుల తీరుపై మండిపడ్డారు. 

 

పోస్టు పెడితే కేసులు.. మాట్లాడితే నోటీసు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని ఆయన నిలదీశారు. సోషల్ మీడియాలో విమర్శలను ఫార్వర్డ్ చేస్తే అరెస్టు చేస్తారా? పోస్టుపెడితే కేసులు, మాట్లాడితే నోటీసు, ప్రశ్నిస్తే అరెస్టు అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛలేదా?  అని నిలదీశారు. టీడీపీ మహిళా నేతల పట్ల అసభ్యంగా పోస్టులు పెట్టిన మీ పార్టీ కార్యకర్తలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో సమాధానం చెప్పండి జగన్ గారు అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: