చదునైన ఆకారంతో, చూడటానికి భారీగా నల్లటి ఆల్చిప్పలా కనిపించే రెండు అరుదైన చేపలు కర్ణాటక, ఉడుపి జిల్లాలోని మాల్పే నగరానికి చెందిన మత్య్సకారుల వలకు చిక్కాయి. సుమారు 750, 250 కిలోల బరువున్న రెండు చేపలను స్టిన్​ గ్రే (శాస్త్రీయ నామం) చేపలుగా గుర్తించారు. స్థానికంగా వీటిని 'థోరేక్​ మీను' అని పిలుస్తారు.మాల్పేకు చెందిన సుభాష్​ అనే జాలరు తన బోట్​లో హార్బర్​ సమీపంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన క్రమంలో.. ఆ చేపలు చిక్కాయి. ఈ క్రమంలో భారీ క్రేన్లతో బయటకు లాగినట్లు చెప్పారు మత్య్సకారులు.


 ఈ చేపలు రుచికరంగా ఉంటాయని, ఎక్కువ శాతం విదేశాలకు ఎగుమతి అవుతాయని తెలిపారు.ఇలాంటి చేపలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ భారీ చేపలను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: