ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీకి నాలుగోద‌శ ఎన్నిక‌లు కొన‌సాగుతున్నాయి. ఉద‌యం ఏడుగంట‌ల నుంచే పోలింగ్ కేంద్రాల‌వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. మొత్తం 44 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 1.15 కోట్ల మంది త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోనున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య జ‌రుగుతుండ‌టంతో నాలుగోద‌శ‌లో ఈసీ క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేసింది. 15,940 పోలింగ్ కేంద్రాల‌వ‌ద్ద 80 వేల మంది కేంద్ర భ‌ద్ర‌తా సిబ్బందిని మొహ‌రించారు. ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న జ‌ర‌క్కుండా ఏర్పాట్లు చేశామ‌ని ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. కేంద్ర మంత్రి బాబూల్ సుప్రియో టోలీగంజ్ నుంచి బ‌రిలోకి దిగారు. మ‌రోవైపు తృణ‌మూల్ కాంగ్రెస్ కీల‌క‌నేత‌, మంత్రి పార్థ‌ఛ‌ట‌ర్జీపై సినీనీటి పాయ‌ల్ స‌ర్కాల్ పోటీచేస్తున్నారు. ఈ 44 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి 2016లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కేవ‌లం ఐదుస్థానాల్లోనే విజ‌యం సాధించ‌గ‌లిగింది. ఈసారి ఎన్ని స్థానాల‌ను ద‌క్కించుకుంటుంద‌నే ఫ‌లితాల త‌ర్వాతే తేల‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: