టీడీపీ రాష్ట్ర కార్య దర్శి నారా లోకేష్ మరొకసారి సి‌ఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కరోనా కట్టడిలో తీవ్రంగా విఫలం అయ్యిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా పేషెంట్ల పరిస్థితి మరియు వారి వెంట వచ్చిన పరిస్థితి హృదయవిదారకంగా ఉందని లోకేష్ ట్విట్టర్ లో వీడియో ఫ్రూప్ తో సి‌ఎం జగన్ పై మండి పట్టారు.

 " జగన్ గారు !! ఒక్క‌సారి కాకినాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ద‌య‌నీయ దృశ్యాలు చూడండి. క‌రోనా మృత‌దేహాలు, ఆ ప‌క్క‌నే కోవిడ్ పేషెంట్లు, వారిని తీసుకొచ్చిన బంధువులు.. అక్కడి పరిస్థితి ఎంతో విచారకరంగా ఉంది. వ‌రండాలోనే శ‌వాలు, నేల‌పైనే పేషెంట్లు..ఎవ‌రు బ‌తికున్నారో, ఎవరు చ‌నిపోయారో తెలియ‌ని దుస్థితి నెలకొంది. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌టంపై దృష్టి పెట్టండి. 104కి కాల్ చేస్తే 3 గంట‌ల్లో బెడ్డు ఇవ్వాలని మీరంటారు. 104 య‌జ‌మాని మామ‌గారైన‌ విశాఖ ఏ2 వైర‌స్ రెడ్డిగారే స్వ‌యంగా ఫోన్ చేసినా వారెత్త‌రు. వ్యాక్సిన్ కొన‌డానికి డ‌బ్బుల్లేవ‌ని చేతులెత్తేసి, చంద్ర‌బాబు గారు వ్యాక్సిన్ తెప్పించాలంటూ స‌ల‌హాల జీత‌గాడు స‌జ్జ‌ల వాగుతున్నారు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మీ వాళ్లే నమ్మలేకపొతున్నారు. మీకు అర్ధం అవుతోందా ..!! " అంటూ సి‌ఎం జగన్ పై నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: