జపాన్‌ను భారీ భూ ప్రకంపం వణికించింది. హోన్‌షు తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించింది. హోన్‌షు తూర్పు తీరంలో ఒక్కసారిగా భూమిలో ప్రకంపనలు సంభవించడంతో దేశం మొత్తం ఆందోళనకు గురైంది. రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ విభాగం వెల్లడించింది. ప్రసిద్ధ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా భూకంపం సంభవించినప్పటికీ ఇప్పటి వరకు.. ప్రకంపనల ప్రభావంపై నివేదికలు అందలేదని చెప్పింది. ఈ ప్రకంపనలు శుక్రవారం ఉదయం 5:28 గంటలకు సంభవించినట్లుగా పేర్కొంది. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని, అయితే ఇప్పటి వరకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: