రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కారణంగా కోవిడ్ 19 వ్యాధి నుంచి రోగులు కోలుకుంటారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డిఎస్ రానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డిఎస్ రానా మాట్లాడుతూ.. "కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ మందులు తొలగించాలని సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా రోగులకు అందించే చికిత్సలో రెమ్‌డెసివిర్‌ సమర్థతపై ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కరోనా చికిత్సలో పనిచేస్తాయి అని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చికిత్సలో పనిచేయని మందులను వెంటనే నిలిపివేయాలి. చికిత్సలో పనిచేయని ప్రయోగాత్మక మందులన్నీ త్వరలోనే నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి, " అని ప్రముఖ డాక్టర్ డిఎస్ రానా చెప్పుకొచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: