నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా అంతా తారక్ మ్యానియా తో ఊగిపోతుంది. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. " తారక్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: