ప్రముఖ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఇంట విషాదం నెలకొంది. మిల్కా సింగ్ భార్య నిర్మలా కౌర్ (85) కరోనాతో కన్ను మూశారు. మిల్కా సింగ్ ఇటీవల కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. మిల్కా సింగ్ తో పాటు ఆయన భార్య భారత మహిళల వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ నిర్మలా కౌర్ కూడా కరోనా బారిన పడ్డారు.

దాంతో ఇద్దరూ మొహాలీ లోని ఫోర్టిస్ట్ హాస్పిటల్ లో చేరారు.  మిల్కా సింగ్ ఆరోగ్యం క్షీణించడం తో పీజీఐఎంఆర్ ఆస్పత్రికి తరలించగా ఆయన ఐసియూ లో చికిత్స పొందుతున్నారు. కాగా ఇంతలోనే ఆయన భార్య నిర్మలా కౌర్ కన్నుమూయడం కుటుంబంలో తీవ్రం విషాదాన్నినింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: