మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ జ‌గ‌న్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. పథకాలకు పేర్లుమార్చి కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రకటనలు ఇస్తున్నార‌ని దేవినేని ఉమ సీఎం జ‌గ‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లేని దిశ చట్టానికి ఎందుకు ఇంత ఎలివేషన్స్ ఇస్తున్నారంటూ మండిప‌డ్డారు. దిశ కోర్టులు పెడతామని పచ్చి అబద్ధాలు చెప్పారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫేక్ ప్రచారం ఫేక్ యాప్  లు అంటూ ఫైర్ అయ్యారు. 

మహిళలకు భద్రత కల్పించడంలో సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం వైఫల్యం క‌నిపిస్తోంద‌ని అన్నారు. దిశ యాప్ అంటూ మక్కికి మక్కీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకువ‌చ్చిన ఫోర్త్ ల‌య‌న్ యాప్ ను కాపీ కొట్టడం ఏంటని ప్ర‌శ్నించారు. ఈ సంధ‌ర్భంగా సోష‌ల్ మీడియాలో దేవినేని ఉమ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓవైపు చంద్ర‌బాబు హ‌యాంలోని ఫోర్త్ ల‌య‌న్ యాప్ గురించి చెబుతుండగా..మ‌రోవైపు సీఎం జ‌గన్ దిశ యాప్ ను గురించి చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: