నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా భీమ్లా నాయక్ నుంచి టైటిల్ సాంగ్ ని యూ ట్యూబ్ లో రిలీజ్ చేసింది చిత్ర బృందం. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరపరిచిన ఈ పాట చాలా పవర్ ఫుల్ గా వుంది. రామ జోగయ్య శాస్త్రి ఎంతో పవర్ ఫుల్ లిరిక్స్ ని రాశారు.రామ్ మిరియాల, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర ఈ పాటని ఆలపించారు. పాటంతా కూడా చాలా స్లో గా కొత్తగా మెలోడీగా సాగిపోతుంది. ఖచ్చితంగా ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బెస్ట్ టైటిల్ సాంగ్ గా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా విడుదల అయిందో లేదో ఫ్యాన్స్ ఈ పాటకి ఎంతగానో ఫిదా అయిపోతున్నారు. పవర్ స్టార్ పట్ల వున్న ప్రేమని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

సెభాష్ భీమ్ల నాయక్ అంటూ వచ్చే పవర్ ఫుల్ లిరిక్స్ శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాయి.ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నాడు.ఇందులో రానా ముఖ్య పాత్రలో నటిస్తుండగా,నిత్యా మీనన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్‎ సినిమాపై అంచనాలను తారా స్థాయికి పెంచడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎన్నో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాయి.


https://youtu.be/J5ee5OHIpIY

మరింత సమాచారం తెలుసుకోండి: