
తాము మాట తప్పడంలేదని, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మొత్తం ప్రకాష్‌రాజ్‌కే మద్దతునిస్తోందని నాగబాబు ప్రకటించారు. ప్రకాష్‌రాజ్ బృందంలోకి జీవిత వచ్చింది కాబట్టి మద్దతునివ్వడంలేదనేది తప్పుడు ప్రచారమని, జీవితపై తమ కుటుంబానికి ఎటువంటి శత్రుత్వం లేదని తేల్చారు. ప్రకాష్‌రాజ్‌పై నాన్‌లోకల్ అనే ముద్రతీసుకురావడంమనేది ప్రత్యర్థులు చేసే తప్పుడు ప్రచారమని, ఓడిపోతామనే భయంతోనే ముందుగా అటువంటి పీలర్‌ను పంపిస్తున్నారన్నారు. అతను భారతీయ నటుడని, నటుడికి భాషతో, ప్రాంతంతో సంబంధంలేదన్నారు. ప్రకాష్‌రాజ్‌కు మొదట్లో మద్దతునిచ్చిన చిరంజీవి ఫ్యామిలీ ఇప్పుడు మద్దతునివ్వడంలేదంటూ చేసే ప్రచారంలో కూడా ఎటువంటి వాస్తవం లేదన్నారు. మా అసోసియేషన్ అభివృద్ధి కోసం ప్రకాష్‌రాజ్ తన బృందంలో ఎవరినైనా చేర్చుకోవచ్చని, అది ఆయనకు హక్కు అన్నారు. ఆయన చేపట్టనున్న ప్రతి కార్యక్రమానికి మెగా ఫ్యామిటీ మద్దతు ఉంటుందని నాగబాబు నొక్కి వక్కాణించారు. మా అభివృద్ధికి ప్రకాష్‌రాజ్ ఒక్కరే సరైన వ్యక్తి అని, ఆయన మాత్రమే సంస్థను అభివృద్ధి చేస్తారన్నారు.