ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మంగ‌ళ‌గిరి టీడీపీ కార్యాల‌యంలో జ‌రిగిన దాడికి నిర‌స‌న‌గా 36 గంట‌లు దీక్ష‌కు కూర్చున విష‌యం విధిత‌మే. తాజాగా
దీక్ష విర‌మించ‌నున్న సంద‌ర్భంగా  చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. డ్ర‌గ్స్ కోసం నేను ధ‌ర్మ‌యుద్ధం చేస్తున్నానని పేర్కొన్నారు. నాకు బూతులు రావు.. ప‌ట్టాభి మాట‌ల‌కు కొత్త అర్థాలు చెప్పారు. డీజీపీ అనుకుంటే అస‌లు దాడి జ‌రిగేది కాదు. పోలీసులు ద‌గ్గ‌రుండి దాడి చేయించారు. దేవాల‌యం లాంటి పార్టీ ఆఫీస్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగింది. దాడి చేసిన వారిపై కేసులు లేవు.  

దాడులు చేయ‌ని మాపై త‌ప్పుడు కేసులు పెడుతున్నారు. త‌ప్పుడు కేసులు పెడితే రేప‌నేది ఉంద‌ని పోలీసులు గుర్తుంచుకోవాల‌న్నారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే టీడీపీ అధికారంలోకి రావాల‌ని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని హైద‌రాబాద్‌కు ధీటుగా త‌యారు చేద్దాం అనుకున్నాను. కానీ ప్ర‌జ‌లు గెలిపించ‌లేదు. న‌న్ను గెలిపించి ఉంటే రాష్ట్రం ఈ విధంగా ఉండేదా అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్యాన్ని నిషేదిస్తాం చెప్పి.. క‌ల్తీ మ‌ద్యంతో ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాటం ఆడుతుంద‌న్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయ‌కుల దెబ్బ‌కు ఎన్నో కుటుంబాలు చితికిపోయాయ‌ని పేర్కొన్నారు. దాదాపు రెండున్న‌ర సంవ‌త్స‌రాల పాటు దాడులు జ‌రిగాయని వెల్ల‌డించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడుతున్నార‌ని.. వారు మాట్లాడితే త‌ప్పు కాదా అని ప్ర‌శ్నించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: