ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టీస్ ఎన్వీ ర‌మ‌ణ పేర్కొన్నారు. 
వివిధ ప‌దవుల్లో సేవ చేసిన మ‌హోన్న‌తుడు రోశ‌య్య అని పేర్కొన్నారు సుప్రీంకోర్టు చీఫ్‌ జ‌స్టీస్ ఎన్వీ ర‌మ‌ణ‌. ఆయ‌న రాజ‌కీయాల్లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్నా.. ముఖ్య‌మంత్రిగా ఉన్నా హుందాగా రాజ‌కీయాల్లో పాల్గొన్న వ్య‌క్తి రోశ‌య్య అని పేర్కొన్నారు. క‌ళ‌లు, సాహిత్యం అంటే ఆయ‌న‌కు ఎంతో మ‌క్కువ అని పేర్కొన్నారు. ఆయ‌న‌కు.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

రోశ‌య్య మృతి ప‌ట్ల ఆయ‌న కుమారుడు ఉద‌యం జ‌రిగిన విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు. సాధార‌ణంగా మెడిక‌ల్ అసిస్టెంట్, అటెండ‌ర్ ఇద్ద‌రూ ఉన్నారు ఇంట్లో.  ఈరోజు 5.30 గంట‌ల‌కు పాలు తాగాడు. అయితే ఇవాళ‌ ఉద‌యం 6 గంట‌ల‌కు ద‌గ్గు వ‌చ్చింది.  ఆ త‌రువాత ప‌డుకున్నాడు. అయితే ఇవాళ ఉద‌యం  7 గంట‌ల‌కు నిద్ర లేప‌డంతోనే ప‌ల్స్ ప‌డిపోయింది. వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించాం.  మేము అస‌లు ఊహించిన‌ది కాదు అని.. భ‌గ‌వంతుని ద‌య‌తో సంతృప్తిక‌రమైన జీవితాన్ని అనుభ‌వించారు కుటుంబ స‌భ్యులు. నాన్న గారిని అన్ని పార్టీల నాయ‌కులు ఆయ‌న‌ను గౌర‌వించార‌ని గుర్తు చేసారు. భౌతికంగా నాన్న లేర‌నే బాధ త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: