ఈరోజుల్లో అన్ని రేట్లు మండిపోతున్నాయి. గతంలో టమాటాలు, ఉల్లి పాయల రేట్లు ఏమీ అర్థం కాకుండా ఉండేవి.. విపరీతంగా పెరిగేవి. ఇప్పుడు ఆ జాబితాలో నిమ్మ కాయ కూడా వచ్చి చేరింది. వేసవిలో ఎక్కువగా వాడే నిమ్మ ధర ఆకాశాన్నంటడం ఆందోళన రేపుతోంది. పంట దిగుబడి సగానికి పైగా తగ్గిపోగా.. ధర ఏకంగా మూడు రెట్లు పెరిగింది. టోకు మార్కెట్లో క్వింటా ధర రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ ఉంది. గతేడాది ఈ టైమ్‌లో ఈ ధర రూ.3 వేలే ఉంది. ఇక రిటైల్‌ మార్కెట్లో కిలో రూ.160 నుంచి 190 వరకూ అమ్ముతున్నారు. ఇక విడిగా రూ.10కి 2 కాయలే ఇస్తున్నారు. ఈ రేట్లు చూసి.. వామ్మో.. నిమ్మ అంటూ జనం పారిపోతున్నారు. అక్టోబరు నుంచి జనవరి వరకూ కురిసిన వర్షాలతో నిమ్మ దెబ్బ తింది. ఇదే రేట్లకు కారణంగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: