కడప జిల్లా విద్యార్థులకు వైసీపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కడప జిల్లాలోని సీబీఐటీలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. మెగా జాబ్ మేళా ను జిల్లాలో నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపి అవినాష్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రాష్ట్ర అభవృద్ధి సాధించాలంటే నిరుద్యోగ యువతకు ఉపాధి , ఉద్యోగ అవకాశం కల్పించాలన్నదే సీఎం జగన్ ఆశయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇప్పటికే మూడు మెగా జాబ్ మేళా లు నిర్వహించి 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని.. రాష్ట్రం సర్వతోముఖభివృద్ది సాధించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశయమని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించకుండా ఉద్యోగాలు తీసేశారని.. వైసీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయం , వైద్య , రవాణా రంగాల్లో దాదాపు ఐదు లక్షల ఉద్యోగ అవకాశం కల్పించామని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: