లోన్ యాప్ ల ద్వారా చైనీయులు ఇండియన్లను దారుణంగా మోసం చేస్తున్నారు. షాకింగ్ ఏంటంటే.. ఈ లోన్ యాప్‌ల నిర్వహణ కోసం కూడా చైనీయులు.. ఇండియన్లనే వాడుకున్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. లోన్ యాప్‌ల ద్వారా చైనా జాతీయులు పాల్పడ్డ మోసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ -ఈడీ సోదాలు ముమ్మరంచేసింది. లోన్ యాప్‌ల ద్వారా అనైతిక పద్దతుల్లో ప్రజల నుంచి భారీ ఎత్తున సంపాదించిన డబ్బును బినామీ కంపెనీల్లో జమ చేసినట్లు ఈడీ గుర్తించింది.
ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే సంస్థలైన పేటీఎం, రేజర్‌పే, క్యాష్ ఫ్రీ పేమెంట్స్‌లను ఉపయోగించినట్లు ఈడీ తేల్చింది. దీంతో బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. పేటీఎం, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ, సహా రుణయాప్‌ల కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో 17కోట్లు.. సీజ్ చేశారు. ఇండియన్ల పేరిట నకిలీ డాక్యుమెంట్లు, అకౌంట్లు సృష్టించిన లోన్ యాప్ నిర్వహకులు. భారీ ఎత్తున నగదును చైనాకు తరలించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: