ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన పర్యటన ను భగ్నం చేయడానికి కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ డీజీపీకి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పర్యటనలో వైసీపీ మద్దతు దారులు, సంఘవిద్రోహుల నుంచి అంతరాయం కలిగే అవకాశం ఉందని వర్ల రామయ్య అనుమానిస్తున్నారు.

అలాంటి అవాంతరాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య  లేఖలో పేర్కొన్నారు. పర్యటనలో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తు న్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పర్యటనకు ఏలూరు పోలీసు సూపరింటెండెంట్, ఇతర సంబంధిత పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం జరిగిందని తెలిపారు.  పర్యటన మార్గంలో టిడిపి జెండాలు, పోస్టర్లు కనిపంచకుండా వైసీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపివేశారని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: