భీమిలిలో నిర్వహించిన వైసీపీ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రాలతో ఫంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి జగన్ పైశాచిక ఆనందం పొందారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేయడం సబబు కాదని, చరిత్రలో సంస్కారం లేని వ్యక్తిగా జగన్ మిగిలిపోనున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వ ఖర్చులతో సభ పెట్టి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం హేయమంటూ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు.


రివర్స్ బారోయింగ్ పేరుతో జగన్ ప్రభుత్వం లెక్కతేలని అప్పులు చేసిందన్న నాదెండ్ల మనోహర్.. ఆర్థిక శాఖ ద్వారా తెచ్చిన 1.72 లక్షల కోట్ల అప్పులతోపాటూ ప్రభుత్వం అదనంగా 91వేల 253.29 కోట్లు అప్పు చేసిదన్నారు. దీనికి లెక్కలు తేలడం లేదని మనోహర్ అంటున్నారు. ఈ డబ్బు ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదన్న నాదెండ్ల మనోహర్ ఈ లెక్కలపై బహిరంగంగా చర్చించడానికి జనసేన సిద్ధంగా ఉందన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా చర్చించేందుకు రావాలని మనోహర్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: