టీడీపీ- జనసేన అభ్యర్థుల తొలి జాబితాను నిన్న చంద్రబాబు ప్రకటించారు. 94 మంది టీడీపీ అభ్యర్థులకు 5 గురు జనసేన అభ్యర్థుల పేర్లతో ఈ జాబితా వచ్చింది. అయితే ఇందులో పవన్‌ సీటు లేదు. పవన్‌ స్థానాన్ని చంద్రబాబు డిసైడ్‌ చేయకుండా అవమానించారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు స్థానం కుప్పం అని ఆయన ప్రకటన చేసుకున్నాడని... బాలకృష్ణ స్థానం హిందూపురం అని ప్రకటించుకున్నారని.. అలాగే, లోకేశ్‌ కూడా మంగళగిరి స్థానమని అనౌన్స్‌ చేసుకున్నారని... కానీ, పవన్‌కళ్యాణ్‌ పోటీ చేసేది ఎక్కడో చెప్పకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఏ స్థానంలో నిలబడతాడో కూడా ఇంకా చంద్రబాబు డిసైడ్‌ చేయలేదంటే అర్ధమేంటంటున్న మంత్రి రోజా.. ఒక చోట ఓడిపోయినోడికి మొదటి జాబితాలో ఇచ్చారని.. రెండు చోట్ల ఓడినోడి గురించి తర్వాత చూద్దాంలే అని అర్ధం చేసుకోవాలి కదా అని జనసేన శ్రేణులకు సూచించారు. తన స్థానంపై ఎందుకింత కేర్‌లెస్‌గా ఉన్నావని పవన్‌కళ్యాణ్‌- చంద్రబాబును అడగాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి రోజా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: