నేడు దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ దుమ్మురేపింది. బెంచ్‌ మార్క్ సూచీలన్నీ నేడు పరుగులు పెట్టాయి. ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో కాస్త సానుకూల ట్రెండ్ కనపడంతో మన మార్కెట్ కూడా బాగానే ర్యాలీ చేసింది. ముక్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్స్ భారీగా లాభల బాట పడ్డాయి. ఇక ఇంట్రాడేలో BSE సెన్సెక్స్ 470 పాయింట్ల లాభంతో 31,849 పాయింట్ల గరిష్టాన్ని తాకగా, NSE నిఫ్టీ కూడా 9326 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 484 పాయింట్ల లాభంతో 31,863 పాయింట్ల వద్ద, నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో 9314 పాయింట్ల వద్ద ముగిసాయి.

 

 

ఇక నేటి మార్కెట్ విశేషాలు చూస్తే .... నిఫ్టీ 50లో ఇన్ఫోసిస్, ICICI బ్యాంక్, HCL, కోటక్ మహీంద్రా బ్యాంక్, tcs షేర్లు లాభపడ్డాయి. ఇందులో tcs ఏకంగా 5% పైగా లాభపడింది. ఇక కోటక్ బ్యాంక్ 8% పైగా ర్యాలీ చేసింది. ఇక నష్టాల విషయానికి వస్తే శ్రీసిమెంట్, NTPC, టైటాన్, HUL, irctc షేర్లు నష్టపోయాయి. ఇందులో అత్యధికంగా టైటాన్ దాదాపు 4% పడిపోయింది. ఇక నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లు మిశ్రమంగా ముగిసాయి. నిఫ్టీ FMCG ఇండెక్స్ 1%  పైగా, నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 0.36 % నష్టపోయాయి. అయితే ఇక మిగతా ఇండెక్స్ లు లాభాల్లోనే ముగిసాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4% పైగా ర్యాలీ చేసింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 3% పైగా, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌ లు 2% పైగా లాభాలలో ముగిసాయి.

 


ఇక రూపాయి విలువ చూస్తే ... అమెరికా డాలర్ ‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి కొద్దిగా లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ 60 పైసలు లాభంతో 76.06 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ ‌లో ముడి చమురు ధరలు కాస్త పెరిగాయి. ఇందులో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ ‌కు 7.76% పెరుగుదలతో 21.95 డాలర్లకు చేరుకోగా, WTA క్రూడ్ ధర బ్యారెల్ ‌కు 12.05% పెరుగుదలతో 15.44 డాలర్లకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: